రేవంత్ ని కాచుకునే మంత్రులు గప్ చుప్ !

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక బాధ్యతలతో సతమవుతూంటారు. ఆయన రాష్ట్రానికి పెద్ద. ఒక వైపు పాలన చూసుకుంటూ మరో వైపు రాజకీయం చేయాలి. అయితే రేవంత్ ని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. అలాగే బీజేపీ. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి మీద తెల్లారి లేస్తే ఒంటి కాలి మీద నిలిచి మరీ విమర్శల జల్లు కురిపిస్తూంటుంది.

చిత్రమేంటి అంటే వీటిలో చాలా వాటికి తిరిగి రేవంత్ రెడ్డే జవాబు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఆయన కేబినెట్ లో ఎంతో మంది మంత్రులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు. తలపండిన వారు ఉన్నారు. కానీ తమ ముఖ్యమంత్రి మీద వచ్చే విమర్శలను కాచుకునే మంత్రులలో ఎక్కువ మంది ఎందుకనో గప్ చుప్ అవుతున్నారన్న ప్రచారం ఒకటి సాగుతోంది.

తెలంగాణాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం మీద మన సీఎం మీద విమర్శలు ప్రతిపక్షం చేస్తోంది అన్నది అసలు ఆలోచిస్తున్నారా అని అంటున్నారు. బీఆర్ఎస్ తన మాటల దాడిని బాగా పెంచేసింది. కేటీఆర్ ఒక వైపు హరీష్ రావు మరో వైపు ఇలా వంతుల వారీగా రేవంత్ మీద దాడి చేస్తున్నారు. ఒక్కోసారి ఆ కామెంట్స్ శృతి మించుతున్నాయని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తున్నారు అని కూడా అంటున్నారు. అయినా కాంగ్రెస్ మంత్రులు కానీ కీలక నాయకులు కానీ లైట్ తీసుకుంటున్నారా అని చర్చ సాగుతోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూముల విషయమో పది వేల కోట్ల కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసినా కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఎటాక్ చేయలేక పోయింది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో చూస్తే మంత్రి పదవుల మీద ఆశలు పెంచుకుని రాని నాయకులు వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని టాక్ ఉంది. ఇక మంత్రులు అయిన వారిలో కొందరు మనకెందుకులే అన్న ఉదాశీనతతో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. దీంతో తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటమే చేస్తున్నారని అంటున్నారు.

తమ మీద చేసే విమర్శలకు రేవంత్ రెడ్డి ఎంత వరకూ కౌంటర్లు ఇస్తారన్న చర్చ కూడా ఉంది. పార్టీ ప్రభుత్వం సమిష్టిగా తిప్పికొట్టకపోతే జనంలో కాంగ్రెస్ వాయిస్ బలహీనం అవుతుందని బీఆర్ స్ సహా ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలే నిజం అనుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే బీఅర్ఎస్ సోషల్ మీడియా మంచి ఊపు మీద ఉందిట. అదే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకో వీక్ అయింది అని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డిని కాచుకోవాల్సిన వారు హ్యాండ్ ఇస్తున్నారా అన్నదే హస్తం పార్టీలో సాగుతున్న చర్చ అని అంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *