హిమాలయాల్లో భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో హోలీ రోజు ఉదయం సంభవించిన భూకంపం కారణంగా ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. లడఖ్‌లో భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. భూకంపం 15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. లెహ్, లడఖ్ హిమాలయ ప్రాంతంలో ఉన్నందున, ఈ భూకంపం జోన్ IV లో వస్తుంది. హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది. హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు తెల్లవారుజామున 2.50 గంటలకు సంభవించాయి. కార్గిల్‌తోపాటు, ఈ ప్రకంపనలు లడఖ్ అంతటా జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం వచ్చిన మూడు గంటలకే, ఈశాన్య భారతదేశంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటలకు ఇక్కడ భూకంపం సంభవించింది. మార్చి 13న మధ్యాహ్నం 2 గంటలకు టిబెట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.