విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

V. Sai Krishna Reddy
1 Min Read

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ జట్టుతో ముంబైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ విమెన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ చేసిన 31 పరుగులే అత్యధికం. భాటి ఫుల్మాలి 30 పరుగులు చేసింది. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టగా, అమెలియా కెర్ 2 వికెట్లు తీసుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు చెలరేగిపోయింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, నట్ స్కివర్ బ్రంట్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న హేలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 47 పరుగులతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రేపు ఢిల్లీ కేపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడుతుంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *