ప్రముఖ సినీ నటి సాయిపల్లవి తన సోదరుడి పెళ్లి వేడుకలో డ్యాన్సుతో అలరించారు. నీలం రంగు చీర ధరించిన సాయిపల్లవి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగిందనే వివరాలు రాలేదు.
సాయిపల్లవి తన కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో గతంలోనూ డ్యాన్సు చేశారు. గతంలో తన సోదరి వివాహం సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. మెహందీ, పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సు చేశారు. అప్పుడు కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి