భారత్‌లో యూట్యూబర్లకు షాక్‌.. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్ల తొలగింపు

V. Sai Krishna Reddy
1 Min Read

వీడియో కంటెంట్ పాలసీకి సంబంధించి YouTube పెద్ద చర్య తీసుకుంది. యూట్యూబ్‌ దాని ప్లాట్‌ఫామ్ నుండి 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. కంటెంట్ ఉల్లంఘన కారణంగా Google వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ వీడియోలను తీసివేసింది. అదే సమయంలో అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్‌ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని ప్లాట్‌ఫారమ్ నుండి 2.9 మిలియన్లకు పైగా (29 లక్షలు) వీడియోలు తొలగించింది. ఈ కంటెంట్ తమ విధానానికి విరుద్ధమని యూట్యూబ్‌ పేర్కొంది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించబడిన కంటెంట్‌లో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలను తొలగించడానికి యూట్యూబ్‌ ఏ వ్యవస్థను ఉపయోగించింది? ఈ వ్యవస్థను ఉపయోగించి యూట్యూబ్‌ మిలియన్ల కొద్దీ వీడియోలను తొలగింపు:

యూట్యూబ్‌ దాని ప్లాట్‌ఫామ్‌ను పారదర్శకంగా ఉంచడానికి AI- ఆధారిత గుర్తింపు వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ యూట్యూబ్‌ మార్గదర్శకాలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలను గుర్తిస్తుంది. తొలగించిన వీడియోలలో ఎక్కువగా పిల్లలను ప్రమాదంలో పడేసే విన్యాసాలు, వేధింపులు వంటి కంటెంట్ ఉన్నట్లు గుర్తిచింది. లక్షలాది YouTube ఛానెల్‌ల తొలగింపు:

యూట్యూబ్ వీడియోలను తొలగించడమే కాకుండా, దాని ప్లాట్‌ఫామ్ నుండి 4.8 మిలియన్లకు పైగా అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌లు స్పామ్ లేదా మోసానికి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాయని యూట్యూబ్‌ చెబుతోంది. ప్రత్యేకత ఏమిటంటే, ఒక ఛానెల్‌ను యూట్యూబ్‌ నుండి తొలగిస్తే, ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన అన్ని వీడియోలు కూడా స్వయంచాలకంగా తొలగించబడతాయి. యూట్యూబ్‌ను పారదర్శకంగా, వినియోగదారులకు సురక్షితంగా ఉంచడానికి ఈ చర్య ఎప్పటికప్పుడు తీసుకుంటామని గూగుల్ వీడియో ప్లాట్‌ఫామ్ తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *