సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నివేదికల ప్రకారం ఎస్పీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నివేదికల ప్రకారం ఎస్పీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అందరూ సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సహా తెలంగాణను కోర్ తెలంగాణ, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణగా విభజించడం సహా 11 జిల్లాల్లో 1355 గ్రామాలతో hmda విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ అమలుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో ను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.గతంలో వీఆర్వో,వీఏవోలుగా పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి పొంగులేటి. టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఎండోమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక అభివృద్ధితో పాటు పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇక పార్లమెంట్ పునర్విభన క్రమంలో దక్షిణాదికి నష్టం జరగకుండా ఉండేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీల్లో 330 రెగ్యులర్,165 ఔట్ సో్ర్సింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది కేబినెట్.పారా ఒలంపిక్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాయికుంటలో 100 పడకలతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మానికి ఆమోదం తెలిపింది.