ఏపీ, తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పనిలో ఉన్నారు అధికారులు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది. ఏ స్థానంలో ఎవరు విజేతలేనేది తేలడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువనుడంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి కొన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరాంధ్ర, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు నాయుడు సత్తాచాటగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ MLCగా మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కొమురయ్య గెలిచారు. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది.