హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు. గరుడ వాహన సేవలో మహిళలు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్రా ఎల్లా, అనుమోలు రంగశ్రీ, ఆలయ ఏఈవో రమేశ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.