నిజామాబాద్ కు కంటైనర్ డిపో నిర్మిస్తాం
రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎన్. రమేష్
వ్యాపారులు సమస్యలను వివరించిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జగదీశ్వరరావు
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి లేదా జానకంపేట లో త్వరలోనే కంటైనర్ డిపోను నిర్మిస్తామని రైల్వే ప్రినిసపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎన్ రమేశ్ అన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జగదీశ్వరరావు ఆధ్యర్యంలో సభ్యులు కలిసి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సరుకుల ఎగుమతికి కంటైనర్ డిపో అవసరమని కోరగా, ఆయన వెంటనే మంజూరు చేశారు. రవాణాకు సంబంధించి ఇతర సమస్యలను ఉమ్మడి సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో ప్రముఖ పసుపు వ్యాపారులు రమేశ్ గుప్తా,ఆకుల సందీప్, కార్యదర్శి కమల్ ఇనాని తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు కంటైనర్ డిపో రావడం గొప్ప విషయమని సరుకులు త్వరత్వరగా ఎగుమతి చేసే వీలవుతుందని ప్రముఖ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.