ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాన్ని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
జనసేన శాసనసభాపక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల స్వాగతోపన్యాసం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి దుర్గేష్ చట్ట సభల్లో తమ అనుభవాలు పంచుకున్నా
రు