విశాఖ ‘మెట్రో’ చకచకా.. భూసేకరణకు అడుగులు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘విశాఖ మెట్రో’పై దృష్టిసారించడంతో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ‘డబుల్ డెక్కర్’ తరహాలో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంది. మొదటి దశలో మూడు కారిడార్లలోని 46.23 కిలోమీటర్లలో దీన్ని నిర్మించనున్నారు. ఇందుకు 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ గుర్తించింది.ఆ మేరకు వివరాలను కలెక్టరేట్ కు పంపించారు…