తుళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రికి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
అమరావతి రాజధాని పనుల్ని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ తన వంతుగా సీఎం చంద్రబాబు కు మాట ఇచ్చేసారు. తెలు గుదేశంనేత బాలకృష్ణ, బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరిం చనున్నామని,ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.
శనివారం హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఇవాళ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.
పీడియాట్రిక్ వార్డు, ఐసీ యూను ప్రారంభించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని, ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందిం చడమే మా బసవతారకం ఆస్పత్రి లక్ష్యమని, బాలకృష్ణ తెలిపారు.