పీఎంజేజేబీవై ద్వారా మరణించిన కుటుంబానికి 2 లక్షల అందజేత
ప్రతి ఒక్కరు ప్రమాద భీమా కట్టుకోవాలి
బినోల బ్రాంచ్ మేనేజర్ సుద్దల అశోక్
ప్రజాజ్యోతి, నిజామాబాద్ బ్యూరో :
నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన జన్నేపల్లి యమున కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద రూ.2 లక్షలను అందజేశారు. మండలంలోని బినోల ఎస్ బిఐ బ్యాంక్ లో పీఎంజేజేబీవై కింద జన్నెపల్లి యమున ప్రతి యేడాది రూ.436 చెల్లించారు. అయితే ఇటీవల ఆమె మరణించడంతో కుమారుడు సుమన్ కు పీఎంజేజేబీవై పథకం ద్వారా వచ్చిన రూ.2 లక్షలను బినోల బ్రాంచ్ మేనేజర్ సుద్దల అశోక్ అందజేశారు. ఈ సందర్బంగా మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అకౌంట్ దారులు ప్రమాద భీమా కట్టుకోవాలని సూచించారు. ప్రమాదానికి గురైన అకౌంట్ దారుడు వారి కుటుంబ సభ్యులకు భీమా వర్తిస్తుందన్నారు.