ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 42 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. 28 చోట్ల ఆప్ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా పోటీ ఇవ్వలేకపోతోంది.
మరోవైపు ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ… ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందనేది ముందే ఊహించిందేనని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ను చీపురుతో ఊడ్చేశారని అన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోలుకున్నారని… అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారని చెప్పారు. మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ మాత్రమేనని చెప్పారు