ప్రజాజ్యోతి నిజామాబాద్ క్రైమ్:
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 ఎన్ డిపిఎస్ కేసుల లో పట్టుబడిన రూ.12 కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. నిజామాబాద్ ఈ ఎస్ మల్లారెడ్డి అదేశాల మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పధార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72 కిలోలు,2 కిలోల డైజీపాం, ఓక గంజాయి మొక్కను జిల్లాలోని జక్రాన్ పల్లి లో గల శ్రీ మెడికేర్ లో దహనం చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం నిజామాబాద్ ఎక్సైజ్ హెచ్ ఓ, సిబ్బంది పాల్గొన్నారు.