ఒకరిది మాకొద్దు.. మాది మరొకరికి ఇవ్వొద్దు: మందకృష్ణ
రిజర్వేషన్లలో తమకు ఎవరి వాటా వద్దని, అలాగే తమ వాటా ఎవరికీ దోచిపెట్టొద్దని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ‘ఎస్సీ వర్గీకరణకు అగ్ర స్థాయిలో నాయకత్వం వహిస్తుంది మాదిగలు, మాదిగ దండోర. మాకు న్యాయం జరగాలి. మా జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారు. ‘ అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.