ప్రజాజ్యోతి ఆర్మూర్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణ పరిధిలోని భోజన్న తోటలో పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడి చేయగా.. పేకాడుతూ ఆరుగురు పట్టుబడినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.21,960 నగదు, 5 బైక్ లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి చర్యల కోసం ఆర్మూర్ ఎన్హెచ్వోకు అప్పగించినట్లు చెప్పారు.