పండుగ అయిపోయింది.
సందడి ఆగిపోయింది.
పల్లె మూగపోయింది.
పిల్లల కేరింతలతో కళకళలాడిన పొలం గట్లు దీనం గా చూస్తున్నాయ్….
వీధి చివర వరకు చెయ్యి ఊపి టాటా చెప్పిన అమ్మ మనసులో బాధ కొండంత అయింది…..
జేబు లో డబ్బులు పెట్టి “జాగ్రత్త రా నాన్న!!” అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు….
సందడి అంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు…..
పందెం కోళ్ల బరులు సర్దేశారు….
సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావన లో ఉన్నారు…..
ఇన్ని నాళ్ళు ముగ్గులతో కళాకళలాడిన వీధులు ఇప్పుడు అవే రధాల ముగ్గులతో టాటా చెప్తున్నాయి….
అయినా సరే మీ కోసం ఈ పల్లెటూరు ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ కేరింతలు మళ్ళీ వస్తాయిలే అన్న భరోసా తో మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది.
ఎక్కడికెళ్లినా ఈ పల్లెటూరుని మరువకండి.
మన మూలాలు బలంగా ఉండాలి.
మన పల్లెటూరు బాగుండాలి.
ఎందుకాంటే పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు
జాగ్రత్తగా వెళ్లి రండి. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయ్…. ఎక్కడెక్కడ నుండో తన కన్నా భూ తల్లి వద్దకు వచ్చి పండగ జరుపుకున్న అందరకీ ధన్యవాదములు