కామారం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరారు.. 

Warangal Bureau
1 Min Read

కామారం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

* ఇద్దరు అరెస్ట్, నలుగురు పరారు

ఆత్మకూరు, మార్చి 21 (ప్రజాజ్యోతి):

ఆత్మకూరు మండలం కామారం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కామారం గ్రామ శివార్లలోని వ్యవసాయ పొలాల్లో పేకాట నిర్వహిస్తున్న విశ్వసనీయ సమాచారం తో ఈ దాడి చేసినట్లు సీఐ సంతోష్ తెలిపారు. ఈ దాడిలో బొట్ల సిరేందర్ (చిన్నకోడపాక), గొట్టిముకుల సందీప్ (గూడెప్పాడు)గ్రామానికి చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులను గమనించిన నలుగురు అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో తక్కల్లపెల్లి చిరంజీవి (కామారం), బూర చిరంజీవి (తిరుమలగిరి), బలబద్ర చిరంజీవి (గూడెప్పాడ్), ఉప్పుల రాజు (ఆత్మకూరు)గా గుర్తించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సంతోష్ తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *