బయో మెడికల్ పరిశ్రమలో భారీగా విదేశీ మద్యం పట్టుబడటంతో కలకలం..!

Bharath Goud
1 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) జిల్లాలోని నర్సాపూర్ మండలం కాగజ్‌మద్దూర్ శివారులో భారీగా విదేశీ మద్యం పట్టుబడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి పరిశ్రమలో అక్రమంగా నిల్వ ఉంచిన ఈ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బయో మెడికల్ వ్యర్థాల మధ్య విదేశీ మద్యం బాటిళ్లను దాచడం చర్చనీయాంశంగా మారింది.

దర్యాప్తు:- విదేశీ బ్రాండ్లకు చెందిన ఈ మద్యం ఇక్కడికి ఎలా చేరుకుంది? దీని వెనుక ఉన్న ముఠా సభ్యులు ఎవరు? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *