మహిళా సాధికారతకు మరో ముందడుగు – మహిళా శ్రీ శక్తి భవన శంకుస్థాపన ఎంపీడీవో సరోజ

Nalgonda Bureau
1 Min Read

గరిడేపల్లి ఫిబ్రవరి 06(ప్రజా జ్యోతి):మహిళా సాధికారతకు మరో ముందడుగు అని ఎంపీడీవో సరోజ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో మహిళా శ్రీ శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక,సామాజిక అభివృద్ధికి దోహదపడే మహిళా శ్రీ శక్తి భవనం మహిళల స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుం దని తెలిపారు.ప్రభుత్వం మహిళ ల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఇలాంటి భవనాలు ఎంతో ఉపయోగపడతాయని, మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమములో సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ ఏపీవో సురేష్, ఏపీఎం అజయ్, గ్రామ సెక్రెటరీ సునీత,ఉప సర్పంచ్ పిడమర్తి నాగరాజు,మాజీ ఎంపీటీసీ సందీప్,మాజీ సర్పంచ్ కడప దేవదానం,వార్డ్ మెంబర్స్ అమరారపు బాబు,గుండు గురవయ్య,అమరారపు కరుణాకర్,తిమోతి రాజు, రాచమల్ల శ్రీకాంత్,గుండు ఉషారాణి,డాక్టర్ సుష్మ,వారి సిబ్బంది అన్నపూర్ణ అంజమ్మ గుండు నరేష్ గుండు వెంకన్న, అంజయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *