వ్యక్తిని హతమార్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు..

Bharath Goud
1 Min Read

మృతుడు గంపల బాలేష్ ఫైల్ ఫోటో

 

వెల్దుర్తి ప్రజాజ్యోతి జనవరి 29

వెల్దుర్తి మండలం బండమిదిపల్లి గ్రామానికి చెందిన గంపల బాలేష్ (46) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యను తానే చేసినట్లు అప్పల సాయిలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో గురువారం లొంగిపోయడు.తన భార్యతో బాలేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్ష పెంచుకుని బుధవారం గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఈ దారుణ హత్యలో గ్రామానికి చెందిన అప్పల శ్రీశైలం, అప్పుల శేఖర్, అలాగే పాంబండ గ్రామానికి చెందిన తలారి యాదగిరి పాత్ర ఉండవచ్చని పోలీస్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ రంగా కృష్ణ తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *