అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
— అభ్యర్థి కోలకాని ప్రసాద్
రామారెడ్డి డిసెంబర్ 07 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ కోలకాని ప్రసాద్ లేడీస్ పర్స్ గుర్తు కేటాయించడం జరిగింది. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక్క అవకాశం కల్పించండి. గ్రామంలో చేయబోయే ముఖ్యమైన పనులు అందరికీ అన్ని విధాలుగా కులమత బేధాలు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చిన మీ అభ్యర్థి ని ఆశీర్వదించండి.పారదర్శక పాలన గ్రామం ముందుకు వెళ్లడానికి కృషి చేస్తాను,గ్రామ సభలను ప్రతి నెలా నిర్వహించడం.అన్ని అభివృద్ధి పనుల ఖర్చులను గ్రామ ప్రజల ముందు స్పష్టంగా ప్రకటించడం,అవినీతి లేని స్వచ్ఛమైన పాలన,శుద్ధమైన నీటి సదుపాయం,ప్రతి ఇంటికి 24/7 తాగునీటి సప్లై అందించే దిశగా కొత్త బోర్లు, పైపులైన్ మరమ్మత్తులు,నీటి ట్యాంకు శుభ్రతపై ప్రత్యేక దృష్టి,గ్రామ రోడ్ల అభివృద్ధి, ప్రధాన రోడ్లను సిసి రోడ్లుగా అప్‌గ్రేడ్ చేయడం
వీధివీధికి రోడ్, డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేయడం,
కాల్వలు,చిన్న చిన్న మరమ్మత్తు,విద్య యువత కు ఉపాధి కల్పన,ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరుకు నిరంతర కృషి,పాఠశాలల్లో బెంచ్‌లు, ఫ్యాన్లు, డిజిటల్ క్లాస్రూమ్ ఏర్పాటు, పదవ తరగతి,ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్,మహిళల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాలు బలోపేతం చేయడం,మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు,స్వయం సహాయక సమూహాలకు వడ్డీలేని రుణాలు పొందడానికి సహకారం,ఆడపిల్లల కోసం భద్రతా చర్యలు,రైతుల సంక్షేమం,గ్రామంలో రైతు వెదిక నిర్మాణానికి కృషి,రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ లాంటి సంక్షేమ పథకాలను రైతులకు అందించే దిశలో రుణాలపై పూర్తి సహాయం కాల్వలు, చెరువుల మరమ్మత్తు సాగునీరు లభ్యత పెంపు,ఎరువులు, విత్తనాల సరఫరా సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ, రైతుల కొరకు సహకార సంఘం నుండి గోదాం ఏర్పాటు చేసి నిరంతరం ఎరువులు లభ్యమయ్యే విధంగా సులభతరం చేయడం,ఆరోగ్యం, శుభ్రత ప్రతి వారానికి ఆరోగ్య శిబిరాలు,చెత్త సేకరణ వ్యవస్థను బలోపేతం
గ్రామంలో డిజిటల్ హెల్త్ ఐడి కార్డ్‌లకు సహాయం
యువతకు ఉద్యోగ అవకాశాలు జాబ్ మేళాలు ఏర్పాటు కంప్యూటర్ ట్రైనింగ్, టెక్నికల్ కోర్సులకు ఉచిత గైడెన్స్
క్రీడా సామగ్రి, ప్లేగ్రౌండ్ విస్తరణ,పెద్దల సంక్షేమం
వృద్ధులకు నెల నెలా ఆరోగ్య పరీక్ష వృద్ధులకు గ్రామంలో అక్కడక్కడ విశ్రాంతి భవనాలను నిర్మించడం,పెన్షన్లకు పూర్తి సహకారం,సమస్యలు మీ సమస్యలే నా సమస్యలుగా భావించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తాను,సామాజిక సేవ,1 రూపాయికే దహన సంస్కారాలు,పేద కుటుంబాలకు అత్యవసర సహాయం,గ్రామంలోని పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విలువనిచ్చి అన్నివర్గాల పండగలకు, గ్రామ దేవతలకు పూర్తిత బాధ్యత వహిస్తా,మీ ఆశీర్వాదం తో మీలో ఒకడిగా ప్రజాసేవ చేయడానికి మీ ముందుకు వచ్చిన మీ యొక్క అభ్యర్థి కోలకాని ప్రసాద్ కు మీ అమూల్యమైన ఓటు లేడీ పర్సు గుర్తుకు వేసి ఆశీర్వదించి గ్రామాభివృద్ధికి కృషి చేయడానికి ముందుంటానని కోరుతున్నా.ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే గ్రామ ప్రగతి చక్రం చూపిస్తాను.
