వెల్దుర్తి:- వెల్దుర్తి మండలం పెద్దపూర్ గ్రామ శివారులో దసరి నర్సమ్మ (38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సత్తయ్య భార్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే తూప్రాన్ సిఐ రంగా కృష్ణ, ఎస్సై రాజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ రంగా కృష్ణ తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.
