29 గ్రామపంచాయతీలకు.. 871 నామినేషన్లు.. నల్లబెల్లిలో రికార్డు స్థాయిలో నామినేషన్స్..

Warangal Bureau
1 Min Read
  • నల్లబెల్లిలో 29 గ్రామపంచాయతీలకు 
  • రికార్డ్ స్థాయిలో 871 నామినేషన్లు 
  • ఎంపీడీవో శుభ నివాస్ 

నల్లబెల్లి, డిసెంబర్ 02( ప్రజా జ్యోతి ):

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రెండో దఫా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శాంతియుతంగా ముగిసింది. 29 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 213, 252 వార్డుల వార్డు సభ్యుల స్థానాలకు 658 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 871 నామినేషన్లు అందినట్లు ఎంపీడీవో డా. జె. శుభానివాస్ తెలిపారు. ఉదయం నుంచే అభ్యర్థుల రద్దీ కొనసాగగా, పరిశీలన సాయంత్రం వరకు సాగింది. యువ అభ్యర్థుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడం ప్రత్యేకతగా నిలిచింది. నామినేషన్లతో మండలంలో ఎన్నికల సందడి మరింత జోరందుకుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *