బీఆర్ఎస్ 15వ దిక్షా దినోత్సవం: 11 రోజుల భారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు

1 Min Read

బీఆర్ఎస్ 15వ దిక్షా దినోత్సవం: 11 రోజుల భారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు

 

పరిగి, నవంబర్ 24 (ప్రజాజ్యోతి) :

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్సీ మొహమ్మద్ సలీమ్ ఆధ్వర్యంలో, అబ్దుల్ ముకీత్ చందా అధ్యక్షతన 15వ దిక్షా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాల కోసం 11 రోజుల నిర్వహంచే షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అన్మోల్ కన్టినెంటల్ హోటల్ టాప్ ఫ్లోర్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఖరారు చేశారు. ఈ సమావేశంలో కార్యక్రమ నిర్వహణను వహీద్ అహ్మద్ అడ్వొకేట్ చేపట్టారు.

 

సమావేశానికి మాజీ ఛైర్మన్లు సయ్యద్ అక్బర్ హుస్సేన్, ఇనాయత్ అలీ బాఖరీ, మొహమ్మద్ షరీఫుద్దీన్, మీర్ మహ్మూద్ అలీ, మొహమ్మద్ నయింవుద్దీన్, జహూరుద్దీన్ యూసుఫీ, సయ్యద్ ఫహీమ్, షేక్ మొహమ్మద్ అజహర్, మాజీ కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ, మొహమ్మద్ అస్లాం, మొహమ్మద్ జానీ మియా, మొహమ్మద్ ముజాహిద్ ఖురేషీ, జమాల్ ఖాన్, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ సైఫుద్దీన్ లోదీ తదితరులు హాజరయ్యారు.

 

నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు ప్రతీ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి, దానిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల్లో మతీయ సమస్యలు, విద్య, ఆరోగ్యం, రక్తదానం శిబిరం, ముషాయిరా, మైనారిటీలకు ఇచ్చిన హామీలపై చర్చ, రైతుల సమస్యలు, పోరాట యోధులకు అవార్డులు, బ్లాక్ డే వంటి అంశాలు చోటుచేసుకోనున్నాయి.

 

  1.  బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే కేసీఆర్‌ అభిమానులు నిర్ణయించిన సమయాలకు హాజరై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన మహత్తర త్యాగాలు, ప్రత్యేకంగా ఆయన నిరాహార దీక్షను స్మరించుకునే కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *