నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా పడటంతో స్థానికులు, వాహనదారులు బస్తాలను తీసుకువెళ్లారు. జిల్లాలోని నార్కట్పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఈ ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ధాటికి లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.
సమీప ప్రాంతాల నుంచి వాహనదారులు, స్థానికులు లారీలోని ఉల్లిపాయల బస్తాలను తీసుకువెళ్లడానికి ఎగబడ్డారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉల్లిపాయలు బస్తాలు తీసుకువెళుతున్న వారిని నిలువరించారు
