ఆర్టీసీ బస్సు టిప్పర్ డీ
-పలువురికి తీవ్ర గాయాలు
-కంకర కింద ఇరుక్కున్న ప్రయాణికులు
-జెసిపి సహాయంతో తొలగిస్తున్న దృశ్యం
తాండూరు నవంబర్ 3 ప్రజా జ్యోతి:- తాండూర్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రత్యక్ష సాక్షి( ప్రయాణికుడు జగదీశ్వర్, స్థానికులు) తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా చేవెళ్ళ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ నంబర్ టీ జి 06టీ 3879, తాండూర్ నుండి వెళుతున్న ఆర్టీసీ బస్సు నంబర్ టీ ఎస్ 34 టీ ఎ 6354 వాహనాన్ని ఎదురెదురుగా వస్తు బస్సును బలంగా డీ కొట్టింది. దీంతో బస్సు కు కుడి( డ్రైవర్ ) వైపు డీ కొట్టిన ఘటనలో రెండు వాహనాలు ఇరుక్కుపోయిన సంఘటన సోమవారం రోజు ఉదయం చేవెళ్ల సమీపంలో చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై కుమ్మరించడంతో తీవ్ర గాయాలతో ఆందోళనకు గురి అయినట్లు స్థానిక ప్రయాణికులు చెప్పారు. ఎంతమందికి గాయాలైనది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు దృశ్యాలు కనిపిస్తాయి.
