భార్యాభర్తలను వరించిన అదృష్టం
- వైన్స్ లక్కీ డ్రా లో రెండు షాపులను గెలుపొందిన దంపతులు
వరంగల్, అక్టోబర్ 27(ప్రజాజ్యోతి):
వరంగల్ రూరల్ నూతన మద్యం పాలసీ 2025- 27 సం.లకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమము నగరంలోని ఉర్సు గుట్ట వద్ద గల నాని గార్డెన్లో సోమవారం జరిగింది. ఈ లాటరీలో నర్సంపేట కు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ మరియు అతని సతీమణి గంప సాంబలక్ష్మిలను అదృశ్యం వరించింది. మెంబర్స్ ఉన్నారు షాప్ నెంబర్ 5 మరియు 38 నర్సంపేట పరిధి షాపులను గెలుపొందారు. ఈ సందర్భంగా తమకు లక్కి డ్రా లో మద్యం షాపులు రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

