ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి కొత్త భవనాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు ఆధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లుగా గదుల నిర్మాణం, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పదిరోజులకు ఒకసారి పర్యటించాలని సూచించారు.