- పంచకూట శివాలయంలో డిప్యూటీ కలెక్టర్ ప్రత్యేక పూజలు
ఆత్మకూరు, అక్టోబర్ 13 (ప్రజాజ్యోతి):
ఆత్మకూరు లోని శ్రీ పార్వతీ సమేత మహాదేవ స్వామి పంచాకూట శివాలయం లో హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పురస్కరించుకొని ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ కు అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. కాకతీయుల కళా సంపద విచ్ఛిన్నం కాకుండా పునర్నిర్మించడం శుభ పరిణామమని అన్నారు. త్వరలోనే తిరిగి ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. వీరి వెంట ఆర్ ఐ ఫరూక్ మహమ్మద్, అర్చకులు శ్రావణ్ శర్మ, కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి, కమిటీ సభ్యులు ఉన్నారు.