- పిడుగు పడి రైతుకు తీవ్ర నష్టం: రెండు గేదెలు దూడలు మృతి
వరంగల్ / నెక్కొండ:
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో సోమవారం ఉదయం 3:00 గంటల సమయంలో పిడుగు పడటంతో ఒక రైతు కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో దాసరి సంపత్ అనే రైతుకు చెందిన రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. గేదెలు దూడలు మృతి చెందడంతో రైతు సంపత్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రభుత్వం స్పందించి, తక్షణమే తమకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.