- గౌతమి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్, బతుకమ్మ సంబరాలు
వరంగల్, సెప్టెంబర్ 25, (ప్రజా జ్యోతి):
హన్మకొండ జిల్లా భీమారం గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రెషర్స్ డే మరియు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల డైరెక్టర్లు మంతెన బిక్షపతి, గొట్టి లక్ష్మణ్, బండి పరుశురాం, మల్ల ధనుంజయ, అంబిద శ్రీకాంత్, సంత రాజు, సంతోష్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని చేరే వరకు పట్టుదల కృషి క్రమశిక్షణ తో పాటు ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో ముందుండి మంచి ర్యాంకులతో కాలేజీ పేరు నిలబెట్టాలని కోరారు తదనంతరం డ్యాన్సులతో ఆట పాటలతో సంతోషంగా గడిపారు.