వరద వృద్ధికి పాడైన రోడ్ల పరిశీలన
— మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి
రామారెడ్డి సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షం వలన వరదలకు పాడైన రోడ్లను పిఆర్ రోడ్లు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు రామారెడ్డి మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంపేట నుండి పోసాని పేట్ ఆర్ అండ్ బి రోడ్డు పరిశీలించడం జరిగింది. ఈ వరదలకు మండలంలో డ్యామేజ్ అయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ కి ఫోన్లో మాట్లాడడం జరిగింది.
ఈఈ స్పందించి వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పడం జరిగింది. లేనియెడల బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు టంకరి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు సిహెచ్ తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ మేర రవీందర్, ముదాం బాలరాజు, కమ్మరి బాలరాజు, తెడ్డు దినేష్, నా రెడ్డి రాజిరెడ్డి, సింగం కృష్ణ, స్వామి, మంగళ శ్రీను, చాకలి నారాయణ, గిద్దె హనుమాన్లు, పోతుల శివారెడ్డి, వడ్లూరి శంకర్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
