సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 04(ప్రజాజ్యోతి):సకల విఘ్నాలను తొలగించే వినాయకుని విగ్రహంను నెలకొల్పి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని 19వ వార్డ్ మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డు సిద్ధి వినాయక కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగలు, ఉత్సవాలు ప్రజల ఐక్యతకు దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల లత రాంరెడ్డి, దంతాల అలివేలు, సంతోష్, పతాని సైదులు పుష్పలత, సీఐ గోపాలదాసు ప్రభాకర్ ప్రియాంక,గుండు అంజలి సురేష్, దుబ్బాక రేణుక ప్రభాకర్ రెడ్డి, ఆకారపు ఉషారాణి పరిపూర్ణాచారి, సుంకరి సైదమ్మ వెంకన్న, వాంకుడోత్ జ్యోతి, దొంగరి రేణుక సందీప్, సుంకరి మణిదీప్ సందీప్,పల్ల శ్రావణి రమేష్,వేగ్గలం బ్రహ్మచారి,బానోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.