“డ్రాగన్ ఫ్రూట్” ఫస్ట్ క్రాప్ జిల్లా కలెక్టర్ కు అందచేసిన రైతు..

Warangal Bureau
1 Min Read

జిల్లా కలెక్టర్ కు డ్రాగన్ ఫ్రూట్స్ అందచేసిన రైతు రంజాన్

దామెర, సెప్టెంబర్ 04 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు రైతు రంజాన్ డ్రాగన్ ఫ్రూట్స్ అందించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దామెర మండలం తక్కల్లపాడు శివారులో డ్రాగన్ ఫ్రూట్ తోట వేసిన రంజాన్ ఈ సీజన్ లో మొదటగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ జిల్లా అధికారులకు అందించాడు. జిల్లా కలెక్టర్, డిఆర్డిఓ మేన శ్రీను కు డ్రాగన్ ఫ్రూట్స్ అందించాడు. ఈ సందర్బంగా రంజాన్ మాట్లాడుతూ.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సహకం ఉందన్నారు. రంజాన్ తో పాటు జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏపిఓ శారద తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *