ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులకు న్యాయం చేయాలి

Kamareddy
1 Min Read

 

కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు

కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 21. (ప్రజాజ్యోతి)

22.08.2025 ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, నాతోటి కళాకారులకు ప్రపంచ జానపద దినోత్సవశుభాకాంక్షలు, చిన్నప్పటినుండి కలను నమ్ముకొని బ్రతుకుతున్న కళాకారులకు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అని కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన సొంటెం సాయిలు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి మా కళాకారుల తరఫున మేము విన్నవించుకోవడమేమనగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యం జరిగిన విషయం తెలంగాణలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మా కళాకారులకు న్యాయం జరిగేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటునామిని, ఏ ప్రభుత్వమైనా మా పేద కళాకారుల ను ఆదుకుంటుందని కోరుకుంటున్నామన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *