గాంధారి ఆగష్టు 21(ప్రజాజ్యోతి)
గాంధారి మండలంలోని జువ్వడి గ్రామానికి చెందిన రైతు కూలీల కుమారుడు దుబ్బే రవి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి, గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఇందులో నాలుగు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. రవి ప్రస్తుతం లింగంపేట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
రవి తన ప్రాథమిక విద్యను జువ్వడిలోని ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత విద్యను నిజామాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించాడు. ఇటీవల జరిగిన గ్రూప్-2 ఉద్యోగాల ధృవపత్రాల పరిశీలనకు హాజరైన రవి, త్వరలో గ్రూప్-2 ఉద్యోగిగా నియామక పత్రాన్ని అందుకోనున్నాడు. రవి విజయంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.