భారీ వర్షంతో పాక్షికంగా దెబ్బతింటున్న కల్వర్టు
(ఎల్లారెడ్డి ఆగస్టు 18 ప్రజా జ్యోతి)
మండలంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే సీసీ రోడ్డుకు డ్రైనేజీ ద్వారా వెళ్తున్న నీరు ఒక వైపు దిగువ భాగం సీసీ రోడ్డు కింద వేసిన మట్టి సగం వరకు కొట్టుకోపోయింది. కళాశాలకు వెళ్లే మార్గం కావడంతో తరుచు విద్యార్థులు, అధ్యాపకులు కారు, ద్విచక్రవాహనాలు వెళ్తుంటారు. పైనుంచి భారీగా వాహనాలు వెళ్తే ప్రమాదం జరిగే ఆకాశం ఉంది.