వాగు ప్రవాహాన్ని పరిశీలించిన తహసిల్దారు, ఎంపీడీవో
— తాసిల్దార్ ఉమలత
— ఎంపీడీవో నాగేశ్వర్
రామారెడ్డి ఆగస్టు 16 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి లో వర్షపాతం జిల్లాలో అతి భారీ వర్షం నమోదు కావడం జరిగింది. ఈ కారణంగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కన్నాపూర్ నుండి గర్గుల్ వరకు గల సర్వీస్ రోడ్డు పై ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో తాసిల్దార్ ఉమలత, ఆర్ఐ రవికాంత్,ఎంపీడీవో నాగేశ్వర్, ఎంపీ ఓ తిరుపతిరెడ్డి,పరిశీలించారు. అనంతరం స్థానికులకు రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయం కలిగిన రోడ్డు నుండి ప్రజలు వెళ్లవలసిందిగా తెలపడం జరిగింది. అదేవిధంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న కుటుంబాలు వదిలి పునరావస కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. అదేవిధంగా వర్షం కారణంగా కూలిపోయిన, లేదా పాక్షికంగా, నష్టం జరిగిన ఇండ్ల కు సంబంధించి రెవెన్యూ కార్యాలయంలో బాధితులు వారి వివరాలు అందించాలని అన్నారు. వరద వృద్ధితి భారీగా ఉండటంతో స్థానిక పోలీస్ సిబ్బంది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలను నిలిపివేశారు.
