విశ్వహిందూ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్
రామారెడ్డి ఆగస్టు 07 (ప్రజా జ్యోతి)
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మాతృశక్తి, దుర్గా వాహిని రామారెడ్డి ప్రఖండ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.రామారెడ్డి గ్రామంలో గల అన్ని పాఠశాలలో జూనియర్ కాలేజీలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ రక్షాబంధన్ దేశాభివృద్ధికి, దేశాన్ని రక్షించడానికి అందరూ కంకణ బద్ధులై ఉండటానికి ప్రతిజ్ఞ చేయించి దేశం కోసం నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష మనం ఇద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్షా అని ప్రతిజ్ఞ చేయించి రక్షలు కట్టడం జరిగింది. ఇందులో కామారెడ్డి జిల్లా విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి దండబోయిన గంగాధర్ (ధరీ), కామారెడ్డి జిల్లా బజరంగ్ దళ్ సహా సంయోజక్ కడెం సాయి కుమార్,కామారెడ్డి జిల్లా దుర్గా వాహిని సంయోజిక మట్టే భవాని,రామారెడ్డి ప్రఖండ విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు సుప్పని పుష్పలత , రామారెడ్డి ప్రఖండ విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి కోటూరి విజయకుమార్, రామారెడ్డి గ్రామ సురక్ష ప్రముక్ గాండ్ల నిశాంత్, దుర్గా వాహిని గ్రామ సంయోజక స్పందన, బజరంగ్దళ్ కార్యకర్తలు లింగాల నిఖిల్, గొల్లపల్లి నిశాంత్, గొల్లపల్లి నిక్షిత్, సంగేపుశేఖర్, వడ్ల అభిరామ్, లింగాల వినయ్, లింగాల అవినాష్, లింగాల నిఖిల్, లింగాల శివ, కామారెడ్డి రాజేష్, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.