పోడు భూముల సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలు ఇవ్వాలి
మాచారెడ్డి జూలై 06. (ప్రజాజ్యోతి)
మాచారెడ్డి మండలం కేంద్రం అక్కాపూర్ గ్రామంలో లో పంట భూములను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ మాట్లాడుతూ అక్కాపూర్ లో ధ్వంసం అయినా పంట భూములను పరిశీలించిన సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా బృందం పోడు భూముల సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలు ఇవ్వాలని,మాచారెడ్డి మండలం అక్కాపూర్ లో పంట భూములను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం అక్కాపూర్ లో ధ్వంసం అయినా పంట భూములను సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా బృందం పరిశీలించారు ఈ సందర్బంగా మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి,అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 22లో డెబ్భై ఎకరాలను 70 ఏళ్లగా సాగు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారన్నారు. ఇట్టి భూములలో బోర్ వేసి, చదును చేసి, ఒడ్లు పోసి, విధ్యుత్ స్థంబాలు వేసి పంటసాగుచేసుకుంటుంటే అట్టి భూములను అటవి అధికారులు బోర్ బావుల్లో రాళ్లు వేసి,పంటలు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక అటవీశాఖ బీట్ ఆఫీసర్ స్వప్న పోలీస్ అధికారి అయినా తన భర్త రమేష్ గౌడ్ ప్రొద్భలంతో రెచ్చిపోయి అమాయకులైన రైతులపై దౌర్జన్యం చేయడం, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంతేకాకుండా అక్రమంగా 40 మందిపై నిజామాబాద్ కోర్టులో కామారెడ్డి కోర్టులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తమ పుస్తెల అమ్ముకొని, అప్పు సప్పు చేసి తమ పట్ట భూములను సాగు చేసుకుని బ్రతుకుతున్న జీవులపై అటవీ శాఖ అధికారులు జులుం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. అటవీ శాఖ అధికారుల ఆగడాలు మానకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదు ఆయన హెచ్చరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పోడుగులకు పట్టాలు ఇస్తానని శఠగోపం పెట్టిందని దాని స్థానంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చి పోడు రైతులకు పంగనామాలు పెడుతున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ లబ్ధిదారుల పోడు భూముల సమస్యని పరిష్కరించాలని, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పోడు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఈ రామకృష్ణ, అఖిలభారత ఐక్య రైతు సంఘం( ఏఐయు కె ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి మీ దేవారం లు ప్రసంగించగా, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాదు రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, ఎస్. సురేష్, బి. కిషోర్, డివిజన్, మండల నాయకులు బి. బాబన్న, ఆర్. దామోదర్, ఎం. లింబన్న, ఎస్. కిశోర్, ఎం. అనిస్, సాయికుమార్, శ్రీకాంత్, దేవరాజ్, సురేష్, మధు, స్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.