పరకాల/ప్రజాజ్యోతి:
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ/వార్డు స్థాయిలో ప్రతి ఆదివారము కాంగ్రెస్ పార్టీ గ్రామ/వార్డు కమిటీ అధ్యక్షులు వారి అధ్యక్షతన గ్రామ/వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నాయకులను ఆదేశించారు. ఆదివారం రోజున గ్రామ/వార్డు స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై చర్చించాలని ఆదేశించారు. ఇందుకు ఎజెండా విడుదల చేశారు.
ఏజెండా లో జులై నెల ఆదివారాలలో జరిగిన గ్రామ/ వార్డు సమావేశాలలో చర్చించిన ఎజెండాపై సమీక్షా, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని, బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై చేపట్టిన పోరాటం పై చర్చ, గ్రామ/వార్డు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చ, కాంగ్రెస్ ప్రజా పాలనలో గ్రామ/ వార్డులలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ నిర్వహించాలని ఎజెండా ఇచ్చారు. గ్రామ స్థాయిలో నిర్వహించే సమావేశాలతో పార్టీ బలోపేతం అవుతుందని, ప్రతి ఆదివారం సమావేశాలు నిర్వహించి ముందుకు పోవాలని నాయకులకు సూచించారు.

