హుస్నాబాద్,ఆగస్టు 02 (ప్రజాజ్యోతి):ఇగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో స్పానిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్విని కుమార్ పర్యవేక్షణలో ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కోక్యతండా గ్రామానికి చెందిన హలవత్ రాజేష్ పీహెచ్డీ పూర్తి చేయడంతో ఈ విభాగం నుండి వచ్చిన మొదటి తెలుగు పరిశోధక విద్యార్థిగా గుర్తింపు పొందారు. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికా, భారతదేశం (తెలుగు) నుండి నవలల పర్యావరణ విమర్శనాత్మక విశ్లేషణ లో భాగంగా ఒక తులనాత్మక అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ అవార్డు ప్రకటించింది.
విద్యార్థి రాజేష్ తమ విభాగంలో పరిశోధన పూర్తి చేయడం గర్వంగా ఉందని స్పానిస్ విభాగం పిహెచ్డి వాణి హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గిరిజన విద్యార్థి స్పానిష్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేయడం పట్ల హలవత్ కృష్ణ, నాగేశ్వరరావు, నరసింహారావు, గుగులోతు రాజు నాయక్, పూదరి వరప్రసాద్ గౌడ్, కక్కెర్ల రవీందర్ గౌడ్, బానోతు సైదా నాయక్ అభినందించారు.