సిద్దిపేట, జులై 11 ప్రజాజ్యోతి:
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుల దేనని అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠం సిద్దిపేట విభాగం నాయకులు గ్యాదరి పరమేశ్వర్, నేతి కైలాసం అన్నారు. సకల విద్యలను నేర్పించిన గురువులను పూజించడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రస్మ పట్టణ అధ్యక్షుడు నరేష్ తో కలిసి వారు మాట్లాడారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ కి గురుపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 12 శనివారం రోజున పట్టణ శివారులోని బైరి అంజయ్య గార్డెన్ లో గురుపూజ మహోత్సవ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టామని.పుణ్యాహవాచనం, అభిషేకం, హనుమత్ హోమం, పూర్ణాహుతి, హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమాన్ మూలమంత్ర జప కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొంటారన్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ట్రస్మా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మోతుకు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.