మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
నిజాంసాగర్ ప్రజా జ్యోతి జూలై 7
తెలంగాణ రాష్ట్ర రోడ్ల, భవనాలు మరియు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నిజాంసాగర్ చౌరస్తాలో ఆగారు. అనంతరం నిజాంసాగర్, పిట్లం మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ఆయనకు శాలువాతో సన్మానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఉన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, పిట్లం మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు వారికి సన్మానించి స్వాగతం పలికారు.