పేలుడు పదార్థాల కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్..?
*టిపిసిసి జనరల్ సెక్రెటరీ..?
* పరారీలో సోదరుడు సురేందర్ రెడ్డి
* ఇటీవలే పేలుడు పదార్థాలపై కేసు నమోదు..? మరవకముందే
కామారెడ్డి ప్రతినిధి జూలై 06 (ప్రజా జ్యోతి)
జిల్లా కేంద్రంలో గత వారం రోజులు గడవక ముందే మరో పేలుడు పదార్థాలపై కేసు నమోదు, జిల్లా కేంద్రంలో గత కొద్దిరోజుల క్రితం పోలీసులు పట్టుకున్న జిలేటిన్ స్టిక్స్, డిటోనేటర్, బండరాలను పగులగొట్టి వాహనం, విషయం మరవక ముందే మరో కేసు నమోదు పై పోలీసుల నిఘా మరింత పెరిగిందని సర్వత్ర సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. జిలేటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని సోదరుడు సురేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం…? అయితే గడ్డం సురేందర్ రెడ్డి పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలి చర్యలు చేపట్టినట్టు సమాచారం? గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాటులో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఏకో టౌన్ షిప్ నుంచి జిలేటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్టుగా..? ఈ కేసులో ప్రభుత్వ అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను శ్రీ వారి వెంచర్ లో నిలువ చేయడంతో పాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డి హస్తమున్నట్లు అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్టుగా విశ్వసనీయ సమాచారం.?