మత్తు పదార్థాలపై అవగాహన
ఇందల్వాయి, ప్రజాజ్యోతి, జులై 5 :
- ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో శనివారం నిజాంబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు డిచ్ పల్లి సీఐ కే.వినోద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఇందల్వాయి ఎస్సై పిల్లలతో మాట్లాడుతూ మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని అవి జీవితాన్ని నాశనం చేస్తాయి అని ఎస్ఐ అన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఏదైనా మోసానికి గురైతే 1930 కు కాల్ చేయాలని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న ఇందల్వాయి స్టేషన్కు ఫిర్యాదు అందించాలని ఎస్సై సూచించారు. మీ చుట్టుపక్కల లో ఏదైనా మోసాలు జరిగితే మీద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయాలని ఎస్సై అన్నారు. గంజాయి బీడీ సిగరెట్ల పట్ల జాగ్రత్త గా ఉండాలని ఎస్సైసందీప్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్స్ సిబ్బంది పాల్గొన్నారు.