టిబెట్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం

V. Sai Krishna Reddy
1 Min Read

ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్‌లో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. NCS ప్రకారం భూకంప కేంద్రం టిబెట్ ప్రాంతంలో ఉంది. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ భూకంపం ప్రభావం మన దేశంలోని ప్రధాన నగరాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కూడా కనిపించింది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్‌సిఎస్ సమాచారం ఇచ్చింది. అదే సమయంలో, పరిపాలన.. విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం అయ్యాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *