పరకాల, ఏప్రిల్ 18 (ప్రజాజ్యోతి):
జల్సాలకు అలవాటు పడి.. అడ్డ దారిలో సంపాదించాలనే తపనతో కొందరు యువకులు డీజిల్ దొంగతనం చేసి పారిపోతుండగా పరకాల పోలీసులు ఎంతో చాక చక్యంగా పట్టుకున్నారు. పరకాల లోని హుజురాబాద్ రోడ్ లో గల హెచ్పి పెట్రోల్ బంకులో మార్చి 25 న తెల్లవారు జామున కియా సైరియస్ కార్లో వచ్చి రెండు క్యాన్లలో డిజిల్ పోయించుకుని.. ఫోన్ పే చేస్తామంటూ డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన వారిపై పరకాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనది. అలాగే రాయపర్తి పెట్రోల్ బంకులో మరియు జఫర్గడ్ పెట్రోల్ బంకులలో ఇలాగే డీజిల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోయి నట్టు పోలీసుల దర్యాప్తులో బయట పడింది. శుక్రవారం పరకాల పోలీసులు వారు అరెస్ట్ చేయడం జరిగింది.
1) ఏనుగుల రంజిత్/ సాంబ రెడ్డి / గీసుకొండ
2) రేవూరి నవీన్ రెడ్డి / రవీందర్ రెడ్డి / ఆత్మకూర్
3) కోడి రెక్క భరత్ చంద్ర /నాగేందర్ / నల్గొండ జిల్లా ఎక్కడ శెట్టిపాలెం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుండి కియా సైరోయిస్ కార్, 4 సెల్ ఫోనులు, 12500/- రూపాయలు నగదు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.